ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు

మా ఇంటి దైవం వినుకొండ శ్రీరామ భక్త శ్రీగుంటి ఆంజనేయస్వామి వారు,
శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహంతో
మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండిన నూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ…
ఈ రోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ.
📅 మంగళవారం : 02-09-2025
ఈ రోజు AVB మంచి మాటలు
🪔 కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే…
మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది.
🪔 చీకటిగా ఉన్న గదిలో చిన్న దీపం ఎంతటి వెలుగునిస్తుందో,
బాధతో నిండిన మనసుకు చిన్న ఓదార్పు కూడా అంతే సంతోషం, అంతే ధైర్యాన్ని ఇస్తుంది.
అందరూ బాగుండాలి… అందులో మనమూ ఉండాలి.
🪔 నమ్మకం ఏర్పడటానికి సంవత్సరాలు పడతాయి, కానీ కోల్పోవడానికి ఒక క్షణం చాలును.
అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు.
మంచిగా జీవించు.
🪔 మన శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు,
చేతులతో నీరు కూడా తాగలేని రోజు,
కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు,
పనులకు ఇంకొకరి పై ఆధారపడిన రోజు,
భావాన్ని నోటితో పలకలేని రోజు…
అలాంటి నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు మాత్రమే జీవితంలోని సాధించినది, కోల్పోయింది, మిగిలింది అన్నీ స్పష్టంగా తెలుస్తాయి.
కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది.
అందుకే అన్నీ బాగున్నప్పుడే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటూ జీవించాలి నేస్తమా!
🪔 ఎవరి మీదనూ ఎక్కువగా ఆధారపడకండి.
ఎందుకంటే మీరే వాళ్ళ ప్రపంచం కాదు.
వాళ్ళ ప్రపంచం వారికి వేరే ఉంటుంది.
✍️ AVB సుబ్బారావు
📞 9985255805
