🍁జ్ఞానాన్వేషణ.🍁

అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది ‘నేను‘ అనే భావం. వ్యక్తిత్వమనే భావం కూడా అన్ని భావాలకీ మూలమే. ఏ భావమైనా దేనినో ఆశ్రయించే ఉదయిస్తుంది. అహంకారం లేకుండా ఏ భావానికీ అస్తిత్వం లేదు. అహంకారమే భావాలకి నిలయం. అంటే, భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే. నువ్వు, అతడు, అది అంటూ మధ్యమ ప్రధమ పురుషులకి సంబంధించినవి ‘నేను’ అనే ఉత్తమ పురుషకి తప్ప ఇంకెవరికీ గోచరించవు. అందువల్ల ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవీ ఉదయిస్తాయి. అంటే మూడూ కలిసే వస్తాయి. కలిసే అణగిపోతాయి. కాబట్టి, ‘నేను’ లేక వ్యక్తిత్వం అనే అంతిమ కారణం యొక్క ఆరాతీయి.
ఈ ‘నేను‘ అనేది ఎక్కడినుండి ఉదయిస్తున్నది? దాని కోసం లోపల వెతుకు.అది మాయమవుతుంది. ఇదే జ్ఞానాన్వేషణ. తన స్వరూపాన్ని తెలుసుకోవటానికి మనస్సు నిర్విరామంగా కృషిచేస్తే మనస్సంటూ ఏమీ లేదని తేలుతుంది. ఇదే సూటైన మార్గం. మనస్సంటే ఆలోచనల సమూహమే. అన్ని ఆలోచనలకు మూలం ‘నేను’ అనే భావం. కాబట్టి మనస్సు అంటే ‘నేను’ అనే ఆలోచనే.
‘నేను’ అనే ఆలోచన యొక్క పుట్టుకే వ్యక్తి యొక్క జననం కూడ. దాని మరణమంటే వ్యక్తి మరణమే. ‘నేను’ అనే భావం ఉదయించిన తర్వతనే, శరీరంతో తప్పుగా తాదాత్మ్యం ఉదయిస్తుంది. ఈ ‘నేను’ అనే భావాన్ని వదిలించుకో. అది సజీవంగా ఉన్నంతకాలమూ బాధ తప్పదు. ‘నేను’ పోతే, బాధా పోతుంది…
⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️. Namaste 🙏