ఆదివారం సెలవువద్దు… ఆదివారం పవిత్ర దినం! ఇకనైనా మేల్కొందాం!

ఆదివారం నాడు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పిన ఓ శ్లోకం:
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||
తాత్పర్యం:
- మాంసాహారం తినడం
- మద్యం సేవించడం
- స్త్రీ సహవాసం
- క్షవరం చేసుకోవడం
- తలకు నూనె పెట్టుకోవడం
ఇవి ఆదివారం నాడు నిషేధించబడ్డాయి. కానీ, ఇవే పనులు మనం ఆదివారమే ఎక్కువగా చేస్తున్నాం! మన పూర్వీకులు చెప్పిన విధంగా, ఈ కర్మలను ఆచరించినవాడు జన్మజన్మలకు దరిద్రుడవుతాడని స్పష్టంగా ఉద్ఘాటించారు.
దరిద్రతనం అంటే కేవలం ధనలేమి మాత్రమే కాదు..!
- కుటుంబ సౌఖ్యం లేకపోవడం
- ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం కూడా దరిద్రతనే!
ఆదివారం—సూర్యుని జన్మదినం!
ఈ పవిత్ర దినం తాగుబోతులకి, భోగ భాండిరులకు ఇష్టమైన రోజుగా మారింది. కానీ మన సనాతన ధర్మం ఈ రోజుకు అపారమైన ప్రాముఖ్యతను ఇచ్చింది. ఎందుకంటే, మన భారతీయ హైందవ సంస్కృతిలో సూర్యోపాసన ప్రధానమైనది.
సూర్యుడు—ప్రత్యక్ష దైవం!
అందుకే మనకి ముఖ్యమైన పండుగలన్నీ సౌరమానం ఆధారంగా వస్తాయి.
- సంధ్యావందనం, సూర్యనమస్కారం లాంటి సంప్రదాయాలు సూర్యుని ఆరాధించేందుకు రూపొందించబడ్డాయి.
ఆదివారం సెలవు—మన సంస్కృతిపై విదేశీ కుట్ర!
మన భిన్నత్వంలో ఏకత్వం గొప్పతనం చూసి ఓర్వలేక, బ్రిటీషు పాలకులు (Thomas Babington Macaulay) మన సంస్కృతిని నాశనం చేసేందుకు ఆదివారం సెలవును ప్రవేశపెట్టారు.
ఈ ప్రభావం ఎంత ఘోరంగా మారిందంటే…
- ఆదివారం నాడు దేవాలయాలు వెలవెలబోతున్నాయి.
- మద్యం దుకాణాలు, హోటళ్లు కిక్కిరిసిపోతున్నాయి.
- మధ్యాహ్నం వరకు నిద్రపోవడం అలవాటైపోయింది.
ఇప్పటికైనా మారుదాం!
- విదేశీ సంస్కృతిని విడనాడండి
- స్వదేశీ సంప్రదాయాలను పాటించండి
- సూర్యనమస్కారం చేయండి
- సూర్యోపాసన ద్వారా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందండి
ఈ మార్పులు ఒక్కరోజులో సాధ్యమయ్యే పనికావు. కానీ, ఒక్కొక్కటీ క్రమంగా పాటిస్తే, మన సంప్రదాయం తిరిగి వెలుగొందుతుంది. సంస్కృతి పరిరక్షణ మన బాధ్యత
