పురోహిత కర్తవ్యం

- కార్యక్రమాలలో ధర్మ ప్రచారం చెయ్యాలి
- వివరణ ఇస్తూ కార్యక్రమం చేయించాలి
- ధర్మ రక్షణ లో వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు గుర్తు చెయ్యాలి.
- ధర్మం పై జరుగుతున్న దాడులు వివరించాలి.
- పలు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, దేవాలయ, పురోహిత రక్షణ, తద్వారా ధర్మ రక్షణ, హిందూ దేశ రక్షణకు సైన్యం తయారు అయ్యేలా కృషి చెయ్యాలి..
- దేశం లో పలు ప్రాంతాలలో దేవాలయాలపై, అర్చక పురోహితులపై జరుగుతున్న పైసాచిక దాడులను దృష్టిలో ఉంచుకుని సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమమే ప్రధాన కర్తవ్యం గా కర్తవ్యాన్ని నిర్వహించాలి…
- అర్చకుడు / పురోహితుడు ఊరు మారతాను, వెళిపోతాను అంటే బాధపడే, అడ్ఫుకునే సమాజం తయారు కావాలి.
- అర్చకత్వం అంటే మంచి, వీరోచిత సమాజమ్ ను తయారుచేసే వృత్తిగా భావించాలి.
- తిరుపతి వంటి దేవాలయాలలో నే కాదు, గ్రామం లో ఉన్న రామాలయం లో కూడా దైవం ఉన్నాడు అనే స్పృహను పెంచే ప్రయత్నం చెయ్యాల్సినది అర్చకుడే కదా.
- పార్టీలకు అతీతం గా ఉండాలి.
- డబ్బులున్న వారిని ఒకలా, పెద వారిని ఒకలా కాకుండా అందరినీ ఒకేలా చూసేలా అర్చకుడు ఉండాలి..
