దసరా శరన్నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత- నాలుగవ రోజు అవతారం – శ్రీ కాత్యాయనీ దేవి

శ్రీ కాత్యాయనీ దేవి
తిథి : ఆశ్వయుజ శుద్ధ చవితి
దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనీ మాతను సకల వరప్రదాయినిగా పూజిస్తారు.
గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందుటకై ఈమెనే ఆరాధించారు.
- బంగారు మేనిఛాయతో ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు ఉంటాయి.
- ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులు అభయప్రదాన ముద్రలో ఉంటాయి.
- వాహనం సింహం.
శ్లోకం
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ॥
కాత్యాయనీ దేవి పూజా ఫలితం
- వివాహ సంబంధిత సమస్యలను తొలగిస్తుందని విశ్వాసం.
- కాత్యాయనీ దేవిని పూజించే ఇంట్లో శాంతి, శ్రేయస్సు కలుగుతాయి.
- వివాహంలో ఆలస్యం, భార్యాభర్తల విభేదాలు, సరైన భాగస్వామి దొరకకపోవడం వంటి సమస్యలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
- కాళిక పురాణం, భాగవత పురాణాల్లో కూడా ఈమె వర్ణన కనిపిస్తుంది.
- గోకుల గోపికలు కృష్ణప్రేమ కోసం యమునా స్నానం చేసి ఉపవాసం చేస్తూ కాత్యాయనీ దేవిని ప్రార్థించినట్లు భాగవత పురాణం పేర్కొంటుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం కాత్యాయనీ దేవి పన్నెండవ గృహానికి అధిపతిగా పరిగణించబడతారు. ఆమెను బ్రహ్మ మండల ఆదిశక్తి దేవి అని కూడా పిలుస్తారు.
శ్రీ కాత్యాయనీ స్తుతిః
(శ్రీ భాగవతాంతర్గతము – శ్రీరామకృతము)
నమస్తే త్రిజగద్వంద్యే సంగ్రామే జయదాయిని ।
ప్రసీద విజయందేహి కాత్యాయనీ నమోస్తుతే ॥
సర్వశక్తిమయే దుష్టరిపు నిగ్రహకారిణి ।
దుష్టజృంభిణి సంగ్రామే జయందేహి నమోస్తుతే ॥
త్వమేకా పరమాశక్తిః సర్వభూతేష్వవస్థితా ।
దుష్టసంహార సంగ్రామే జయందేహి నమోస్తుతే ॥
రణప్రియే రక్తభక్షే మాంసభక్షణకారిణి ।
ప్రపన్నార్తిహరే యుద్ధే జయందేహి నమోస్తుతే ॥
ఖట్వాంగాసికరే ముండమాలాద్యోతిత విగ్రహే ।
యే త్వాం స్మరంతి దుర్గేషు తేషాం దుఃఖహరా భవ ॥
త్వత్పాదపంకజాద్దైన్యం నమస్తే శరణప్రియే ।
వినాశయ రణే శత్రూన్ జయందేహి నమోస్తుతే ॥
అచిన్త్య విక్రమే చిన్త్య రూప సౌందర్యశాలిని ।
అచిన్త్య చరితే చిన్త్యే జయందేహి నమోస్తుతే ॥
యే త్వాం స్మరంతి దుర్గేషు దేవీం దుర్గవినాశనీమ్ ।
నావసీదంతి దుర్గేషు జయందేహి నమోస్తుతే ॥
మహిషాసృక్ప్రియే సంఖ్యే మహిషాసురమర్ధిని ।
శరణ్యే గిరికన్యే మే జయందేహి నమోస్తుతే ॥
ప్రసన్నవదనే చండి చండాసుర విమర్దిని ।
సంగ్రామే విజయందేహి శత్రూన్ జహి నమోస్తుతే ॥
రక్తాక్షి రక్తదశనే రక్తచర్చిత గాత్రకే ।
రక్తబీజనిహన్త్రీ త్వం జయందేహి నమోస్తుతే ॥
నిశుంభ శుంభ సంహన్త్రి విశ్వకర్త్రి సురేశ్వరి ।
జహి శత్రూన్ రణే నిత్యం జయందేహి నమోస్తుతే ॥
భవాన్యేత జగత్సర్వం త్వం పాలయసి సర్వదా ।
రక్ష విశ్వమిదం మాతః హత్వైతాన్ దుష్టరాక్షసాన్ ॥
త్వం హి సర్వగతాశక్తిః దుష్టమర్దనకారిణి ।
ప్రసీద జగతాం మాతః జయందేహి నమోస్తుతే ॥
దుర్వృత్తబృందదమని సద్వృత్తపరిపాలిని ।
నిపాతయ రణే శత్రూన్ జయందేహి నమోస్తుతే ॥
కాత్యాయనీ జగన్మాతః ప్రపన్నార్తి హరేశివే ।
సంగ్రామే విజయందేహి భయేభ్యః పాహి సర్వదా ॥
ఇతి శ్రీ భాగవత మహాపురాణాంతర్గత శ్రీరామకృత కాత్యాయనీ స్తుతిః
సమాప్తి
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మహాలక్ష్మీ శ్రీ శారదా మాత్రే నమః
