భద్రాచలంలో ఆస్థాన పురోహిత పదవి ఖాళీ: మూడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడంపై భక్తుల ఆవేదన

భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవాలయంలో అర్చకులు, వేద పండితులు, వంట స్వాములు తదితర ఉద్యోగ నియామకాలకు దేవాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చినా, గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆస్థాన పురోహిత పోస్టుకు మాత్రం ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదో భక్తులకు అర్థం కావడం లేదు.
అనాదిగా ఈ ఆస్థాన పురోహిత పదవి స్మార్త బ్రాహ్మణ వర్గానికే చెందింది. ప్రతిరోజూ తిథి, వార, నక్షత్రం వివరాలు తెలియజేసి, స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం నిర్వహించడం, దేవాలయ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయో తెలియజేయడం, వాటిని సమీపంగా పర్యవేక్షిస్తూ జరగేలా చూడడం — ఇవన్నీ ఈ పదవి యొక్క ప్రధాన బాధ్యతలు.
ఇంత ముఖ్యమైన ఈ పోస్టు ఆరు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నా, దాని గురించి ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ ఉద్యోగ నియామకాలు ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నాయి? అసలు ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? — అంటూ రామ భక్తులు చర్చించుకుంటున్నారు. జై శ్రీరామ్.
ఇక ప్రస్తుతం ఎన్నికల మోడల్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం ఎలా సాధ్యం? వెంటనే ఈ ప్రకటనను రద్దు చేయాలి. ఎన్నికల అనంతరం, ఖాళీగా ఉన్న ఈ పురోహిత పోస్టును, అది అనాదిగా ఉన్న విధంగా స్మార్త బ్రాహ్మణ వర్గానికే ఇవ్వాలని రామ భక్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
