2025 కర్తరి పర్వకాల సూచిక: ఏం చేయాలి, ఏం చేయకూడదు

వాసు ముక్తినూతలపాటి గారి సూచనలతో
చిన్న కర్తరి కాలం
తేదీ: 04/05/2025 (వైశాఖ శుద్ధ సప్తమి, ఆదివారం)
నుండి
తేదీ: 11/05/2025 (వైశాఖ శుద్ధ చతుర్దశి, ఆదివారం) వరకూ
పెద్ద కర్తరి కాలం
తేదీ: 11/05/2025 (వైశాఖ శుద్ధ చతుర్దశి, ఆదివారం)
నుండి
తేదీ: 28/05/2025 (జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి, బుధవారం) వరకూ
ఈ కాలంలో చేయరాని పనులు
- కర్ర పనులు, మట్టి పనులు
- వ్యవసాయ రంగంలో చెట్లు కొట్టడం, దున్నటం, బోర్లు వేయడం
- ఇండ్ల నిర్మాణంలో తాటాకు కప్పులు కప్పడం, కపాటాలు చెయ్యడం
- గృహ సంబంధిత పనులు (పెద్ద కర్తరిలో)
కర్తరిలో చేయదగిన శుభ కార్యాలు
శాస్త్ర వచనం ప్రకారం:
“మౌంజి బంధ వివాహేచ | ప్రవేశే యజ్ఞకర్మ ణి |
భరణి కృత్తికాశ్చైవా | న దోషమంటపాదిషు ||”
అర్థం: కర్తరి కాలంలో కూడా కొన్ని శుభకార్యాలు చేస్తే పాపముండదు.
- ఉపనయనము
- వివాహం
- నూతన వధువు గృహ ప్రవేశం
- యజ్ఞములు
- మంటపాదులు గట్టడం
వివరణ: ఇక్కడ “ప్రవేశే యజ్ఞకర్మణి” అన్న వాక్యం ద్వారా “నూతన వధువు గృహ ప్రవేశం”ను కూడా శుభకార్యంగా భావించవలెను.
గమనిక: ఇది సాంప్రదాయ ఆధారిత పంచాంగ సూచన. వ్యక్తిగత ముహూర్తాలు మరియు శుభసమయాల కోసం వాస్తవిక పండితుల సలహా తీసుకోవటం ఉత్తమం.
