బ్రాహ్మణ బంధువులకు నమస్కారం

ఈ మధ్య ఓ ప్రాంతంలో జరిగిన జంగమ మహాసభలో కొంతమంది పెద్దలు —
“వచ్చే పది సంవత్సరాల్లో బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయకూడదు, దేవాలయాల్లో అర్చకులు కాకూడదు” అని ప్రతిజ్ఞ చేశారట.
ఇది మాటలకే పరిమితం కాదు — నిజంగా అలానే జరుగుతుందేమో అనిపిస్తోంది.
ఇది ఎందుకు జరుగుతోంది? లోపం ఎక్కడ ఉంది?
మనమే ఆలోచించాలి.
నాకు కనిపించిన మూడు ప్రధాన కారణాలు ఇవే —
- అరకొర చదువుతో పౌరోహిత్యం చేయడం
- పౌరోహిత్యం చేస్తూ వ్యసనాలకు బానిసలవడం
- జిహ్వా చాపల్యం — బజారులో తినడం, సంప్రదాయాలను తాకట్టు పెట్టడం
ఇలా వ్యవహరిస్తూ మనమే మన గుర్తింపును కోల్పోతున్నాం.
పౌరోహిత్యం అంటే ప్రజలకు హితం చెప్పడం, ఆచారాలను నేర్పించడం — కానీ ఇవన్నీ మానేశాం.
గాయత్రీ మంత్రం మర్చిపోయాం.
భోజన నియమాలు పాటించడం మానేశాం.
ఆచార విరుద్ధంగా ప్రవర్తిస్తూ మిగతా సమాజంలో అపవాదులు పెంచుకుంటున్నాం.
హైదరాబాద్లోనే ఎన్నో ఉదాహరణలు — పౌరోహిత్యంలో అన్ని కులాలవారు ప్రవేశించారు.
అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్న వారు గురుస్వాములై మంత్రాలు నేర్చుకుని పౌరోహిత్యాన్ని చేపడుతున్నారు.
వారు బ్రాహ్మణునిగా పేరుతొడుగుతున్నారు.
ఐక్యత లోపం
కులాంతర వివాహాలు
విద్యలో నిర్లక్ష్యం
పౌరోహిత్యంలో కమిషన్ వ్యవహారాలు
మన భావభాషల్లోని పతనం
ఆచారాలను తాకట్టు పెట్టిన తరం
బ్రాహ్మణ సంఘాలు భోజనసభలకే పరిమితం అయ్యాయి.
ఇది ధర్మరక్షణ కాదని మనం తెలుసుకోవాలి.
ఇప్పటికే ఇతర కులాలవారు వేదాలను నేర్చుకుంటున్నారు.
మన పిల్లలు అలర్ట్ కాకపోతే రేపటి గురువు వారు — మనవాళ్లు సహాయకులు మాత్రమే అవుతారు.
ఈ పరిస్థితి మారాలంటే —
బ్రాహ్మణునిగా బ్రతకాలి.
ధర్మాన్ని నిలబెట్టాలి.
సంప్రదాయాలను పరిరక్షించాలి.
అప్పుడు మాత్రమే మన వారసత్వం నిలుస్తుంది.
ఇది ఎవరికైనా గుండె నొప్పిగా అనిపిస్తే అది అవమానం కాదు — మన introspection కోసం.
బ్రాహ్మణునిగా బ్రతకండి — బ్రాహ్మణ ఆచారాన్ని నిలబెట్టండి.
వి వి రమణశర్మ సిద్ధాంతి
Astro Jyothirmaya
