నేడు పెళ్లి — ఒక సమస్యగా మారిపోయిందా?

పిల్లలకు పెళ్లి చేయాలనేదే తల్లితండ్రుల కోరిక.
కానీ పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకును వెతుకుతున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు అంతులేనివి!
మన అమ్మాయి అత్తవారింట్లో ఎలా ఉంటుందో?
అక్కడ అత్త, మామలు ఉంటారా? లేదా వాళ్లు ఎలా ఉంటారు?
మన అమ్మాయిని గౌరవిస్తారా? రాచి రంపాన పెడతారా?
అలాంటి అనుమానాలు తల్లిదండ్రుల మనసుల్లో అనివార్యం.
నేటి కాలంలో —
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం,
ఉద్యోగం వల్ల నగరాల్లో చిన్నచిన్న అద్దె ఇళ్ళలో వేరుగా జీవించడం,
ట్రాఫిక్, ఒత్తిడి కారణంగా — కొత్త జంటలు తమకంటూ జీవితం ప్రారంభించడం
ఇవి వాస్తవాలు.
అప్పుడు ప్రశ్న ఏమిటంటే —
నేటి యువత చదువులు, జీతాలు ఎంత ఉన్నా…
సంస్కారం విషయంలో మాత్రం మునుపటి తరం పెద్దల పాదాలను పట్టవలసిందే.
పెళ్లికొడుకు విషయంలో తల్లితండ్రుల ఆలోచన —
బాగా సంపాదించాలి, మంచి ఆస్తి ఉండాలి,
తన భార్యను ప్రేమించాలి, కావాల్సినవి కొనిపెట్టాలి,
మందు, సిగరెట్ అలవాట్లు లేకూడదు,
కారు ఉండాలి, గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉండాలి,
ఆఫీసు పనయిన తర్వాత ఇంటికొచ్చి భార్యతోనే గడపాలి!
అదే తల్లితండ్రులకు ఓ సందేశం —
మీ పిల్లలు పెద్దయ్యారు, చదువుకున్నారు.
పెళ్లయ్యాక వారే కలిసి నిర్ణయాలు తీసుకుంటారు.
మీరు అడిగితేనే సలహా ఇవ్వండి.
ప్రతి విషయంలో జోక్యం చేసుకోకండి.
వారి జీవితం మీద అదుపు చూపకండి.
కొడుకు తల్లిదండ్రులు —
మీ కోడలిని వంట రాదా అని విమర్శించకండి.
రాకపోతే నేర్చుకుంటుంది.
వంటమనిషిని పెట్టుకోండి, లేదా మీరు వండండి.
కాబోయే కోడలికి —
రోజూ పూజ చేయాలి, పాదున్నే లేవాలి, మడి పాటించాలి —
ఇలా చెబితే సంబంధాలు చెడిపోతాయి.
నేటి తరం చదువులతోనే బిజీ అయిపోతున్నారు.
అవన్నీ నేర్చుకునే సమయం వారికి ఇవ్వండి.
అంతేకాదు —
కొంతమంది తల్లితండ్రులు సంబంధాలు వచ్చినా పట్టించుకోవడం లేదు.
వయస్సు మించిపోయాక పెళ్లి గురించి ఆలోచించడం వల్ల —
పిల్లలు మనకు తెలియకుండా ప్రేమించుకుని పారిపోతున్నారు.
50 ఏళ్ల క్రితం పెళ్లిళ్లు —
ఐదు రోజులపాటు, ఆనందంగా, ప్రేమాభిమానాలతో, పెద్దల ఆశీర్వాదాలతో జరిగేవి.
పెళ్లిళ్లు బంధాలను మరింత బలపర్చేవి.
ఇప్పుడు…
లేనిపోని ఆలోచనలు చేసి, పిల్లల పెళ్లిని వాయిదా వేయడం తల్లితండ్రులకు హక్కు లేదు.
పుట్టిన ప్రతి బిడ్డకు పెళ్లి చేయడం తల్లితండ్రుల బాధ్యత.
తల్లితండ్రులకు ఓ మనవి —
మీరు తప్పనిసరిగా పిల్లల శ్రేయస్సు కోరాలి —
కానీ వాటి కోసం వారి జీవితాల్లోకి అవసరమైనంత వరకు మాత్రమే జోక్యం చేసుకోవాలి.
బి మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్: 9133320425
