జీవనశైలి

భార్యాభర్తల ప్రేమకథ

blank

ఒక చిన్న ఆట… ఒక గొప్ప విజయం!

అర్థం చేసుకున్న ప్రేమే నిజమైన సంపద

ఒక దంపతులు… ప్రతిరోజూ మాటల తోటల్లో పోట్లాడే భార్యాభర్తలు.
భర్త చిన్న ఉద్యోగి, ఓ సాదాసీదా మనిషి. కానీ భార్య మాత్రం…

“పక్కింట్లో వాళ్లు ఫ్రిజ్ తెప్పించుకున్నారు…”
“ఎదిరింటి వారు కొత్త కార్ కొన్నారు…”
“వెనకింటి వారు విదేశాలకు వెళ్ళారు…” అని ఏదో ఒక కోరిక, ఏదో ఒక అర్ధం…

భర్త ఎన్నిసార్లు చెప్పాడు:

“నాకు సాధ్యమవ్వదు బంగారం… మన దగ్గర ఉన్నదాన్లో సంతృప్తిగా ఉండాలి.”
కానీ భార్యకు అవేవీ అర్ధం కాలేవు…

కాలం గడుస్తోంది…
ఒకరోజు చుట్టాల్లో పెళ్లి.
వీళ్లు కూడా వెళ్లారు. భార్య అప్పుడే భర్తపై కోపంగా ఉంది – “నాకు పట్టు చీర తెచ్చి ఇవ్వలేదని”…

పెళ్లిలో సరదాగా ఒక ఆట ప్రకటించారు:
దంపతులు పాల్గొనాలి… గెలిచిన వారికి ₹20,000 బహుమతి!
ఆట ఏంటంటే?
భార్యను భర్త ఎత్తుకొని కుర్చీ మీద కూర్చోపెట్టాలి – మరలా దింపాలి.
కుర్చీలు ఒకదానిపై ఒకటి వేసి వెళ్తారు… అంతే!

ఆట మొదలైంది.
1వ కుర్చీ… 2వ కుర్చీ…
3, 4, 5…
భర్త తన శక్తికి మించిన శ్రమతో భార్యను ఎత్తి కూర్చోపెడుతున్నాడు.
8, 9, 10…
ఇప్పటికే భర్త శరీరం చెమటలు చిందిస్తోంది.
అయినా ఆగలేదు.
కళ్ళలో కన్నీళ్లు… అయినా ఆ ప్రయత్నం ఆపలేదు.

తన కోసం ఇంతగా కష్టపడుతున్న భర్తను చూసిన భార్యకి కళ్లెదుటే సత్యం నాట్యం చేసింది.

“ఇంతకాలం నా కోరికల పేరుతో ఆయన మనసు పిండేశానని నాకిప్పుడే అర్ధమైంది…”
“నన్ను అర్ధం చేసుకున్న భర్తను నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు…”

ఆ ఆట ముగిసింది.
₹20,000 బహుమతి ప్రకటించారు.
నిర్వాహకులు మాట్లాడుతూ చెప్పారు:

“ఈ ఆటలో గెలుపూ ఓటమీలేదు… భార్య ఉన్న భర్త విజేత… భర్త ఉన్న భార్య విజేత… వారి ప్రేమే నిజమైన గెలుపు!”

కానీ… భార్య ఆ డబ్బు తీసుకోలేదు.
ఆమె మాటలు ఇలా:

ఈ డబ్బుల కోసమే నా భర్తను బాధించాను… కానీ ఇప్పుడే తెలిసింది – ఆయన ప్రేమే నిజమైన విలువ!
ఇవాళ వాడిని పొందినదే నిజమైన బహుమతి!”

అప్పటి నుండి ఆమె తన భర్తను ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ప్రేమించసాగింది.
ఇంటి చిన్నచిన్న గొడవలు ఉంటే ఉండొచ్చు… కానీ “నాకిది కావాలి, అది కావాలి” అనే కోరికలు మాయమయ్యాయి.

ఈ చిన్న సంఘటన –
ఒక కుటుంబాన్ని కొత్తగా తయారుచేసింది,
ఒక ప్రేమను పదిలంగా నిలిపింది,
ఒక జీవితాన్ని అర్థవంతంగా మార్చింది.


ఇలాంటి సంఘటనలు మన కుటుంబాలలో ప్రేమ, క్షమ, సహనాలకు గుర్తుగా నిలిచిపోతాయి. మన మనసుల్లో ప్రేమ పరిపుష్టిగా ఉండాలంటే – అర్థం చేసుకోవడమే మొదటి అడుగు!

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక