మనిషి మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నంతకాలమే!

ఎందుకంటే అక్కడ —
- ఎవ్వరూ తప్పు చేయలేరు.
- చుట్టూ చీకటి ఉన్నా భయం ఉండదు.
- దేనిపైనా ఆశ పుట్టదు.
- “నాదీ” అనే స్వార్థం ఉండదు.
- ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం సాగుతుంది.
అందుకే అంటారు…
మనిషి చూసిన తొలి దేవాలయం తల్లి గర్భం అని.
కాని… తల్లి గర్భం నుండి బయటపడ్డాకే అసలు కథ మొదలవుతుంది
అదే — “నేను”, “నాదీ” అనే ఆలోచన!
స్వార్థంతో పరుగులు తీస్తుంది మనిషి జీవితం.
- ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో;
గడుపుతున్న ఈ క్షణం మాత్రమె మనది. - నిన్న – తీరిపోయిన ఋణం
- రేపు – దేవుడు ఇచ్చిన వరం
కాబట్టి…
రేపనే రోజున మంచి ఆలోచనలతో, మంచి హృదయంతో ముందుకు సాగాలి.
కోరికలు
కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే సామానుల వంటివి.
అవి ఎంత ఎక్కువైతే — జీవిత ప్రయాణం అంత భారంగా, కష్టంగా ఉంటుంది.
మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు
ఖాళీగా ఉంటే పనికిమాలిన ఆలోచనలు వచ్చి,
అజ్ఞానిగా మారి, చెడు వ్యసనాలకు బానిసై, వక్రమార్గంలో పయనిస్తాడు.
అందుకే…
మంచి ఆలోచనలతో, భవిష్యత్తుపై మంచి ప్రణాళికతో ముందుకు సాగాలి.
