ఆదివారం శుభోదయం – జీవిత పాఠాలు

ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి వారి కరుణాకటాక్షాలతో,
మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండిన నూరేళ్ళు ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.
ఈ రోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు హృదయపూర్వక శుభాభినందనలు. 💐🌹🍇🥭🍫
📅 31-08-2025 (ఆదివారం)
🌿 ఈ రోజు AVB మంచి మాటలు 🌿
- మనం కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన మిత్రులు, మన సుఖాల్లో కూడా ప్రధాన భాగస్వాములు అవుతారు.
కానీ నేటి సమాజంలో కష్టాల్లో తోడుగా నిలిచిన వారినే వెన్నుపోటు పొడవటం సాధారణమైపోయింది. - మిత్రమా!
👉 “మోస్తున్నాడు కదా” అని మోయలేని బరువు వేయడం తప్పు.
👉 “తగ్గుతున్నాడు కదా” అని తక్కువ చేసి చూడటం కూడా తప్పే. - మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడేవారు చాలామందే ఉంటారు.
అలాంటి వారికి మౌనమే గొప్ప సమాధానం. - టైం బాగోలేనప్పుడు సింహం కూడా సర్కస్‌లో గంతులు వేయాల్సి వస్తుంది.
అలాగే మనకూ తాత్కాలికంగా అడ్డమైన వారితో మాటపడాల్సి వస్తుంది.
అది మన తగ్గుదల కాదు, నెగ్గే రోజు ఇంకా రాలేదనే విషయం మాత్రమే. - గతాన్ని తలుచుకుంటే అందులో ఆనందకరమైన రోజులు ఉన్నట్టే బాధాకరమైన రోజులు కూడా ఉంటాయి.
అందుకే అంటారు — “మంచి-చెడుల కలయికే జీవితం.” - ఓడిపోయినప్పుడు భుజం తట్టిన చెయ్యి, గెలిచినప్పుడు హృదయం హత్తుకునే అర్హత పొందుతుంది.
- మనల్ని చూసి కుక్కలు మోరిగినంత మాత్రాన మనం దొంగలమైపోము.
మన నిజమైన విలువ తెలిసిన రోజు, అవే మన ముందర తొకూపుకుని నిలుస్తాయి. - మనిషి జీవితం రైలు ప్రయాణంలాంటిది.
ధనవంతుడు AC రిజర్వేషన్‌లో, మధ్యతరగతి వాడు రిజర్వేషన్‌లో, పేదవాడు జనరల్ భోగిలో వెళతాడు.
కానీ చివరికి దిగే గమ్యం ఒక్కటే – ఆ స్థాయిలన్నీ అక్కడే ముగుస్తాయి.
✨ ఈ ఆదివారం మీకు శుభం, శాంతి, సంతోషం కలగాలని ఆశిస్తున్నాను ✨
