ప్రేమే దైవం

ప్రేమించగల మనసు ఉంటే
ప్రేమించబడకుండా ఉండేది ఏదీ లేదు.
కొత్తగా పుట్టిన పసికందును తన ఒడిలోకి తీసుకుని ముద్దాడుతూ
తన అపారమైన ప్రేమను ఆ బిడ్డపై ఒలకబోసే మాతృప్రేమ –
అది సాటిలేని, మరెక్కడా దొరక్కపోయే ప్రేమ.
ఆ ప్రేమలో,
తాను తొమ్మిది నెలలు పడిన కష్టాలు మరచిపోతుంది తల్లి.
తన శరీరం ఒక నిర్వచనీయమైన ఆనందానుభూతికి లోనవుతుంది.
అలాంటి ప్రేమను పొందాలని
ప్రతి స్త్రీ మనసారా కోరుకుంటుంది.
అది మాతృత్వపు విలువలు తెలిసిన మాతృమూర్తి యొక్క మహోన్నత లక్షణం.
ఈ వరం – మాతృత్వం –
కేవలం స్త్రీకి మాత్రమే దేవుడు ప్రసాదించిన అపూర్వమైన వరం.
ఆ వరాన్ని పొందాలంటే స్త్రీ వివాహం చేసుకోవాలి.
