ఆరోగ్యమే మహాభాగ్యం

మన ఆరోగ్యం మన ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది – ఇది ముమ్మాటికీ వంద శాతం నిజం.
ఆహార నియమాలు:
- నాలుకకు రుచి తెలుసు, కానీ ఆరోగ్యాన్ని కాపాడటం తెలియదు.
- బాగా రుచిగా ఉందని అతిగా తినడం వల్ల శరీరానికి ఇబ్బందులు కలుగుతాయి.
- మసాలా పదార్థాలు, ఎక్కువ నూనె, అధిక ఉప్పు తక్కువగా వాడండి.
- తేలికపాటి, శక్తినిచ్చే ఆహారాన్ని బాగా నమిలి, ప్రశాంతంగా తినండి.
- ఆరోగ్యకరమైన పదార్థాలు:
- ఉల్లి, వెల్లుల్లి, పసుపు, పచ్చిమిర్చి, ఏలకులు, లవంగాలు.
- డ్రై ఫ్రూట్స్, నిమ్మ, ఆపిల్, జామ, అరటి, సీజనల్ ఫ్రూట్స్ (షుగర్ లేకుంటే మితంగా తీసుకోండి).
శారీరక ఆరోగ్యం:
- వ్యాయామం తప్పనిసరి.
- ఆవేశం, ఆతృత, కోపం – ఇవన్నీ మీకే నష్టం.
- ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే అలవాటు చేసుకోండి.
- కనీసం 6-8 గంటలు నిద్ర అవసరం.
తప్పక పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు:
- ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్, మైదా పదార్థాలు, అధిక తీపి తగ్గించుకోండి.
- హోటల్ ఆహారానికి అలవాటు పడకండి.
- అనారోగ్యం పాలై కుటుంబాన్ని, సమాజాన్ని కష్ట పెట్టకుండా, ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!
✍️ బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్: 91333 20425
