తిరుమల దర్శనం పై APSRTC & TSRTC ముఖ్య ప్రకటన

తిరుమలకు వెళ్లే భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ APSRTC మరియు తెలంగాణ TSRTC ముఖ్య నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై APSRTC & TSRTC బస్సుల్లోనే భక్తులకు రోజుకు 1000 శీఘ్ర దర్శనం (₹300) టిక్కెట్లు జారీ చేయబడతాయి.
ఇది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారుల అనుమతితో ప్రవేశపెట్టిన ప్రత్యేక సౌకర్యం.
ఎలా పొందాలి?
- APSRTC / TSRTC లగ్జరీ & లహరి బస్సుల్లో తిరుపతికి ప్రయాణించే వారు
₹300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చు. - దర్శనం సమయాలు:
- ఉదయం 11:00 గంటలకు
- సాయంత్రం 4:00 గంటలకు
- తిరుమల బస్టాండ్‌కు చేరుకున్న తర్వాత APSRTC సూపర్వైజర్లు
భక్తులకు దర్శనంలో పూర్తి సహకారం అందిస్తారు.
ఎక్కడెక్కడి నుంచి బస్సులు?
APSRTC & TSRTC కలిసి రోజూ 650 బస్సులు తిరుపతికి నడుపుతున్నాయి.
ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు అందుబాటులో ఉంది.
అంతేకాక, ఈ సౌకర్యం క్రింది నగరాల నుంచి వచ్చే భక్తులకు మరింత ప్రయోజనకరం:
- బెంగళూరు
- చెన్నై
- కాంచీ
- వెల్లూరు
- పాండిచ్చేరి
- హైదరాబాద్
భక్తులకు సూచన
తిరుపతికి వెళ్లే వారు
ముందుగానే RTC బస్సుల్లో దర్శనం టిక్కెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలి.
