పిల్లలకు పెళ్లి చెయ్యలేని పరిస్థితి – తల్లితండ్రుల ఆందోళన

నేడు పిల్లలను పెంచడం, చదివించడం, వారికి ఉద్యోగాలు సంపాదించడం, బాగా డబ్బు సంపాదించడం కంటే వారి పెళ్లి జరగడం చాలా కష్టమైన విషయంగా మారింది.
ముఖ్యంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల్లో పిల్లల వివాహం ఒక విషమ పరిస్థితిగా మారింది.
కారణాలు
- పిల్లల్లో వివాహంపై నిర్లక్ష్య ధోరణి.
- తల్లితండ్రుల అతిగా ఉన్న కోరికలు.
- “పెళ్లి అయితే పిల్లలు మనను బాగా చూసుకుంటారో లేదో” అనే అనుమానం.
- కాబోయే కోడలు/అల్లుడు మరియు వారి కుటుంబ సభ్యులపై అనవసర అనుమానాలు.
- విపరీతమైన ధనపిచ్చి.
డబ్బు – ఒక భ్రమ
డబ్బు/ఆస్తులు ఎక్కువ ఉంటే పిల్లలు ఎక్కువ సుఖపడతారని అనుకోవడం ఒక భ్రమ.
అదే నిజమైతే, డబ్బున్న భార్యభర్తలు ఎప్పుడూ విడాకులు తీసుకోరుకదా!
కానీ గణాంకాల ప్రకారం, ఎక్కువగా విడాకులు తీసుకునేది ఎగువ మధ్యతరగతి భార్యభర్తలే.
డబ్బుతో ఒక మంచి, వసతులతో కూడిన ఇల్లు కొనుగోలు చేయవచ్చు.
కానీ మనఃశాంతి మాత్రం కొనలేం.
నిజమైన సుఖం
మనఃశాంతి, ఆనందం – ఇవి కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలపై ఆధారపడి ఉంటాయి.
బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులతో కడుపు నిండదు.
- మంచి భోజనం వండి పెట్టే భార్యను పొందిన భర్త
- చెడు అలవాట్లు లేకుండా, భార్యను అర్థం చేసుకుని, ఆమె కష్టాలలో పాలు పంచుకునే భర్తను పొందిన భార్య
ఇలాంటి వారు నిజమైన అదృష్టవంతులు.
కృత్రిమ సౌకర్యాలు, కపట ప్రేమలతో జీవితం దుర్లభంగా మారుతుంది.
దాంపత్యం విలువ
భార్యభర్తల మధ్య అనురాగం, దాంపత్య జీవితం – వీటికి లక్షల్లో విలువ కట్టలేం.
ఇది ఊహించలేని మధురానుభూతుల సమ్మేళనం.
సరైన వయస్సులో వివాహం
పిల్లలను కనాలనుకుంటే స్త్రీ, పురుషులు 28 ఏళ్లలోపు వివాహం చేసుకోవాలి.
స్త్రీకి 30 ఏళ్లు దాటాక పిల్లలను కనడానికి శరీరం సహకరించదు.
అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది.
సరైన వయస్సులో పిల్లలను కనడం వలన:
- వారి ఆటపాటలు అమ్మమ్మ/నానమ్మ లేదా తాతయ్య గా చూసి ఆనందించవచ్చు.
- జీవితం మరింత పరిపూర్ణమవుతుంది.
దేశానికి ఋణం తీర్చడం
ప్రతి భార్యభర్త కనీసం ఇద్దరు పిల్లలను మాతృభూమికి కానుకగా ఇవ్వాలి.
అప్పుడే ఈ హిందూ దేశం స్థిరంగా నిలబడి, ప్రపంచ పటంలో గుర్తింపు పొందుతుంది.
స్వార్థం, ధనకాంక్ష వీడి – మనం, మన పిల్లలు బాగుపడతాం.
మన దేశం సుభిక్షంగా ఉంటుంది.
ముగింపు
మనం ఈ భారతావనిలో పుట్టినందుకు ఋణం తీర్చుకోవడం కోసం ప్రతి యువత సరైన వయస్సులో వివాహం చేసుకోవాలని ఆలోచించాలి.
— బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
📞 91333 20425
