జీవనశైలి

మనిషి మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నంతకాలమే!

blank

ఎందుకంటే అక్కడ —

  • ఎవ్వరూ తప్పు చేయలేరు.
  • చుట్టూ చీకటి ఉన్నా భయం ఉండదు.
  • దేనిపైనా ఆశ పుట్టదు.
  • “నాదీ” అనే స్వార్థం ఉండదు.
  • ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం సాగుతుంది.

అందుకే అంటారు…

మనిషి చూసిన తొలి దేవాలయం తల్లి గర్భం అని.


కాని… తల్లి గర్భం నుండి బయటపడ్డాకే అసలు కథ మొదలవుతుంది

అదే — “నేను”, “నాదీ” అనే ఆలోచన!
స్వార్థంతో పరుగులు తీస్తుంది మనిషి జీవితం.


  • ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో;
    గడుపుతున్న ఈ క్షణం మాత్రమె మనది.
  • నిన్న – తీరిపోయిన ఋణం
  • రేపు – దేవుడు ఇచ్చిన వరం

కాబట్టి…

రేపనే రోజున మంచి ఆలోచనలతో, మంచి హృదయంతో ముందుకు సాగాలి.


కోరికలు

కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే సామానుల వంటివి.
అవి ఎంత ఎక్కువైతే — జీవిత ప్రయాణం అంత భారంగా, కష్టంగా ఉంటుంది.


మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు

ఖాళీగా ఉంటే పనికిమాలిన ఆలోచనలు వచ్చి,
అజ్ఞానిగా మారి, చెడు వ్యసనాలకు బానిసై, వక్రమార్గంలో పయనిస్తాడు.

అందుకే…
మంచి ఆలోచనలతో, భవిష్యత్తుపై మంచి ప్రణాళికతో ముందుకు సాగాలి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక