ఆధ్యాత్మికత

ధనుస్సంక్రమణం / ధనుర్మాసారంభం

Dhanur Sankramanam

తిరుప్పావై – 1వ పాశురము

శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్రానువాదముతో


అవతారిక

గోపికలు ఈ వ్రతాచరణకు అనుకూలమైన కాలం మనకు లభించిందని భావించి, ముందుగా ఆ కాలాన్ని స్తుతిస్తున్నారు.
ఈ వ్రతాన్ని ఆచరించడానికి అర్హులైనవారు ఎవరో నిర్ణయించుకుంటున్నారు.
ఈ వ్రతం ద్వారా తాము పొందదలచుకున్న ఫలం ఏమిటో,
ఆ ఫలాన్ని ప్రసాదించగల సాధనం ఏమిటో స్మరిస్తూ,
ఈ తొలి పాశురంలో అపార ఆనందంతో తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు.


తాత్పర్యము

ఓహో! ఇది మార్గశిరమాసము.
చంద్రకాంతితో నిండిన శుభదినము.

ఓ అందమైన ఆభరణాలతో అలంకరింపబడిన సఖీబాలికలారా!
ఐశ్వర్యంతో విరాజిల్లే వ్రేపల్లెలో, సంపదలతో తులతూగుచున్న గోపికలారా!

ఈ మార్గశీర్షస్నానాన్ని ఆచరించాలనే సంకల్పం ఉన్నచో రండి, ముందుకు నడవండి.
వాడియైన వేలాయుధాన్ని ధరించి, కృష్ణునికి ఏ విధమైన ఆపద కలగకుండా కాపాడే
శ్రీనందగోపుల కుమారుడైన ఆ బాలసింహాన్ని,

అందమైన నేత్రాలతో అలరారే యశోదామాత యొక్క లాలిత్యమూర్తిని,
నీలమేఘశ్యాముని, ఎర్రతామరలవంటి కళ్లుగలవాడిని,
సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ప్రసాదించువాడిని,
దివ్యముఖమండలంతో జగత్తును మోహింపజేసే నారాయణుని —

ఆయననే తప్ప వేరొకనిని ఆశ్రయించని మనకు,
మనము కోరుకొనే ఈ వ్రతసాధనకు కావలసిన
‘పర’ అనే వాద్యాన్ని ఆయనే ప్రసాదించును.

మన ఈ వ్రతాచరణను చూసి
లోకమంతా ఆనందంతో పరవశించునట్లు,
మీరు అందరూ వచ్చి
ఈ పవిత్ర వ్రతంలో భాగస్వాములు కావలసిందిగా కోరుచున్నాము.


శుభమస్తు

శ్రీ సద్గురు పీఠం ద్వార
సమస్త లోకా సుఖినోభవంతు

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected