20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషం
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.
వృషభం
చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు.
మిథునం
ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయట పడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
కర్కాటకం
వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
సింహం
నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. వృథా ఖర్చులపై పునరాలోచన అవసరం. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు పెరగటం వలన విశ్రాంతి తక్కువ. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్యా
అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘకాలంగా వేదిస్తున్న సమస్యల నుండి విముక్తి పొందుతారు.
తుల
నేత్ర అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. గృహంలో కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వ్యాపార లాభాల కోసం మరింత శ్రమ అవసరం. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృశ్చికం
ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటిలో మరియు బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
ధనస్సు
సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలత కలిగిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహ వాతావరణం కలిగిస్తాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకరం
ముఖ్యమైన పనులు సులువుగా సిద్ధిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు జరుగుతాయి.
కుంభం
నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టిన పనులు సులువుగా పూర్తవుతాయి.
మీనం
ప్రధాన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో వివాదాలు కలిగే అవకాశం. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.
శుభం భూయాత్
