రాశి ఫలితాలు

29-08-2025 / శుక్రవారం / రాశి ఫలితాలు 🌟

blank

♈ మేషం

సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో చికాకులు తప్పవు.


♉ వృషభం

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సమాజంలో గౌరవం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం పొందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.


♊ మిథునం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.


♋ కర్కాటకం

ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తాయి. దూరప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.


♌ సింహం

ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సమయానికి లభిస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ పరిస్థితులు స్థిరంగా ఉంటాయి.


♍ కన్యా

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. కొత్త వస్తువులు, వాహనాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలంగా మారుతాయి.


♎ తుల

పాత మిత్రుల ద్వారా కీలక సమాచారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందుతారు.


♏ వృశ్చికం

గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. కుటుంబం మరియు వృత్తి జీవితంలో చికాకులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారంలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.


♐ ధనుస్సు

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగి కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.


♑ మకరం

నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులతో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.


♒ కుంభం

వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణభారం పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు వస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. సంతాన ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. సోదరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.


♓ మీనం

ప్రయాణాలలో కొత్త మిత్రులు పరిచయం అవుతారు. ఆప్తులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.


శుభం భూయాత్

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు