హిందూమతం

ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకంటారు

blank

ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకంటారు…మరి దక్షిణాయనం పుణ్యకాలం కాదా? అంటే..దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం. ఉత్తరాయణం పగటి సమయం. దేవతలు మేల్కొని ఉండే ఈ ఆరునెలల కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆరు నెలలు పూజలు, ఉపవాసాలు, తీర్థయాత్రలకు అనువైన సమయం అని చెబుతారు. ఉత్తరాయణంలో సూర్య సంచారం మొదలయ్యే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు.

శ్రీ మహావిష్ణువు యోగనిద్రనుంచి లేచి..ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని .. ఈ సమయంలో ఆచరించే పూజలు, ఉపవాసాలు విశేష ఫలితాన్నిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ విషయం అందరకీ తెలియజెప్పేందుకే మకర సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఇంటింటికి వచ్చే హరిదాసులు విష్ణు స్వరూపంగా, బసవన్నలు శివ స్వరూపంగా భావిస్తారు.

దక్షిణాయనం పితృదేవతల ఆరాధనకు మంచిది..అయితే ఉత్తరద్వారం తెరిచి దేవతలు నిద్రలేచే సమయం కావడంతో సంక్రాంతికి పితృ దేవతలకు తర్పణాలు విడుస్తారు. ఈ రోజు చేసే దానధర్మాలు రెట్టింపు ఫలితాన్నిస్తాయి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
హిందూమతం

భయాన్ని అధిగమించడం: బ్లాక్ మ్యాజిక్‌లో నమ్మకం నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి

ఉపోద్ఘాతం: భయం మరియు బ్లాక్ మ్యాజిక్ యొక్క ఆకర్షణను అర్థం చేసుకోవడం మనలో చాలా మంది జీవితంలో ఒక చెడ్డ సంఘటన మరొకదానిని అనుసరిస్తున్నట్లు అనిపించే సమయాలను
blank
హిందూమతం

హిందూమతం – అన్ని మతాలకు తండ్రి

హిందూమతం తరచుగా పురాతనమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మతంగా పరిగణించబడుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విశ్వాసాలు, అభ్యాసాలు మరియు తత్వాలపై దాని లోతైన ప్రభావం కారణంగా చాలా