చంద్రగ్రహణం – ఎప్పుడు? ఎవరు చూడవచ్చు?

తేదీ: 7 సెప్టెంబర్ 2025, ఆదివారం
పౌర్ణమి: భాద్రపదమాస పౌర్ణమి
సమయం: రాత్రి 9:54 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1:26 నిమిషాల వరకు (మొత్తం 3 గంటల 30 నిమిషాలు)
గ్రహణం: రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం
కనిపించే ప్రదేశం: భారతదేశం అంతట
జ్యోతిష్య వివరాలు
- ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతుంది.
- శతభిషా నక్షత్రం మరియు పూర్వాభాద్ర నక్షత్రం వారు గ్రహణం చూడకూడదు.
- ఈ రెండు నక్షత్రాలకు మాత్రమే దోషం ఉంటుంది.
- గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణాన్ని చూడకూడదు.
ఆచార నియమాలు
- రాత్రి 7:30 లోపే భోజనం చేయాలి.
- ఆ తర్వాత ఏదీ తినరాదు.
- మరుసటి రోజు ఉదయం ఇంటిని శుద్ధి చేసి దేవుని పూజ చేయాలి.
దోష నివారణ & గ్రహణ శాంతి
శతభిషా మరియు పూర్వాభాద్ర నక్షత్రం వారు చేయవలసింది:
- దేవాలయానికి వెళ్లాలి.
- కేజీ పావు మినుములు, కేజీ పావు బియ్యం తీసుకోవాలి.
- చంద్రుడు, సర్ప విగ్రహాలు వెండితో చేయించి ఒక మట్టిమూకుడులో నెయ్యి పోసి పెట్టాలి.
- బ్రాహ్మణులకు దక్షిణతో సహా దానం ఇవ్వాలి.
కుంభరాశివారు తప్పక చేయాలి.
ఇతర రాశివారికి ఎటువంటి ఇబ్బంది లేదు.
ముఖ్య గమనికలు
- యూట్యూబ్, వాట్సాప్ లలో కనిపించే చిత్రవిచిత్రమైన వాదనలు నమ్మకండి. అవి లైకులు కోసం చేసే స్టంట్లు మాత్రమే.
- 7వ తేదీ రాత్రి అన్ని ఆలయాలు మూసివేస్తారు (కాళహస్తి వంటి కొన్ని క్షేత్రాలు మినహాయించి).
- మరుసటి రోజు శుద్ధి అనంతరం ఆలయ దర్శనాలు ప్రారంభమవుతాయి.
అపోహలు నమ్మకండి. భయపడకండి.
