స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శుభోదయం |¦¦|

The Essence of Life – A Sacred Verse from Narasimha Satakam

𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝

🌿 శ్లోకం 🌿

ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు,
ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తన వెంట రాలేరు,
భృత్యులు మృతిని దప్పింపలేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు,
బలపరాక్రమ మేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు
గోచిమాత్రంబైన గొంచుబోడు,
వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన జేసెడి వారికి బరమ సుఖము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

|| నరసింహ శతకం ||


🌼 తాత్పర్యం 🌼

ఎవరూ వెయ్యేండ్లు జీవించరు.
ధనం శాశ్వతం కాదు.
మరణానంతరం భార్య, పిల్లలు, బంధువులు, సేవకులు — ఎవరూ వెంటరారు.
బంధువులు మన ప్రాణాన్ని కాపాడలేరు; బలం, పరాక్రమం కూడా పనికిరాదు.

అందువల్ల వెఱ్ఱి మమకార భ్రమలను విడిచి,
అశాశ్వతమైన లోక విషయాలను త్యజించి,
శాశ్వతమైన ముక్తికోసం నరసింహ స్వామిని భజించడం
జీవితంలో అత్యుత్తమమైన సుఖం.


🔱 భూషణ వికాసా! శ్రీ ధర్మపుర నివాసా!

దుష్ట సంహారా! నరసింహా! దురితదూరా! 🔱

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి