homebanner

వృషభ లగ్నస్థ గ్రహములు – పూర్తి ఫలితాలు

వృషభ లగ్నస్థ గ్రహములు – పూర్తి ఫలితాలు

వృషభ లగ్నస్థ గ్రహములు

వృషభ లగ్నమున జన్మించిన వారు గుణవంతులు, ధనవంతులు. గురు భక్తి కలవారు. ఈ జాతకులు ధైర్యశాలిగాను, శౌర్యవంతుడుగాను ఉండును. ఈ జాతకునకు గురు, శుక్ర, చంద్రులు పాపులు అగుదురు. రవి, శనులు శుభులు. శని రాజయోగకారకుడు. గురునకు మారక లక్షణములున్నాయి.


సూర్యుడు

సూర్యుడు వృషభరాశికి చతుర్థాధిపత్యం వహిస్తాడు. కేంద్రాధిపతి కనుక సూర్యుడు వృషభ లగ్నానికి శుభంగా మారే గ్రహమై మంచి ఫలితాలను అందిస్తాడు.

లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ప్రకాశవంతమైన ముఖ వర్చస్సు, ఉత్సాహం అందిస్తాడు. మంచి వాక్చాతుర్యం వీరి సొంతం. ఆకర్షణీయమైన వీరి మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం వీరికి అనుకూలమే.

పంచమాధిపతి లగ్నంలో ఉండటంతో సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం అధికం. సూర్యుడి పూర్ణదృష్టి సప్తమ స్థానం మిత్రస్థానం అయిన వృశ్చిక లగ్నం మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వాముల, మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. భాగస్వాములతో ఉద్రేకపూరిత వాతావరణం ఏర్పడినా విశ్వాసపాత్రులుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు.


చంద్రుడు

వృషభ లగ్నానికి చంద్రుడు తృతీయాధిపతి. అయితే చంద్రుడు వృషభంలో ఉచ్చస్థితిని పొందడంతో చంద్రుడు వృషభ లగ్న జాతకులకు మంచి ఫలితాలు ఇస్తాడు.

లగ్నస్థ చంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు. శీతల స్వభావం ఉన్న చంద్రుడు ఉన్నందున శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. వీరికి జలుబు, దగ్గు, ఆయాస సంబంధిత వ్యాధులు రావచ్చు.

ఈ జాతకులు గుణవంతులుగా, దయాస్వభావులుగా ఉంటారు. విలాసవంతమైన జీవితమంటే ఇష్టపడతారు. తల్లితో సత్సంబంధాలు ఉంటాయి. మాతృవర్గ బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. కళలంటే ఆసక్తి ఎక్కువ. కల్పనాశక్తి అధికం.

జలం, నౌకా ప్రయాణం, జల ప్రదేశాలు వీరిని ఆకట్టుకుంటాయి. కళారంగ సంబంధ వృత్తులలో వీరు రాణిస్తారు. చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమస్థానం మిత్రస్థానమైన వృశ్చికం మీద సారిస్తాడు కనుక వీరికి అందమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు.


కుజుడు

వృషభ లగ్నానికి కుజుడు సప్తమ, ద్వాదశాధిపతి. కేంద్రాధిపత్యం వహిస్తాడు కనుక కుజుడు వీరికి కారక గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాడు.

లగ్నస్థ కుజుడు వ్యక్తికి ఆకర్షణీయమైన, శక్తివంతమైన శరీరం ఇస్తాడు. విలాసవంతమైన జీవితం అంటే ఇష్టపడతారు. కోప స్వభావం ఉంటుంది. వ్యవసాయ రంగం మీద మక్కువ చూపుతారు. భూములు కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి చూపుతారు.

సాహసవంతమైన వృత్తులలో రాణిస్తారు. వ్యాపారంలో రాణించడం కష్టం. రక్షణ వ్యవస్థలో ఉద్యోగం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు.

లగ్నస్థ కుజుడు చతుర్థ దృష్టిని మిత్రస్థానం సింహం మీద ప్రసరిస్తాడు కనుక తల్లి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. తల్లి కోపస్వభావం కలిగి ఉంటుంది.

సప్తమ దృష్టిని వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక కోపస్వభావం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. అయితే అభిప్రాయ భేదాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతాయి.

అష్టమ దృష్టి ధనస్సు మీద ప్రసరిస్తాడు కనుక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం సాధారణంగా ఉంటుంది.


బుధుడు

వృషభ లగ్నానికి బుధుడు ధనాధిపత్యం, పంచమాధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపతి లగ్నస్థుడు అవ్వడంతో బుధుడు కారక గ్రహమై మంచి ఫలితాలు అందిస్తాడు.

లగ్నస్థ బుధుడు వ్యక్తికి బుద్ధికుశలత, సాహసం ఇస్తాడు. వ్యాపారం అనుకూలిస్తుంది. ధైర్యసాహసాలు అధికం. సొంత నిర్ణయాలతో విజయం సాధిస్తారు. శిక్షణ, ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తారు.

బుధుని పూర్ణ దృష్టి సప్తమస్థానం మీద ఉంటుంది కనుక బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. స్నేహపూరితమైన ప్రేమ చూపించే జీవిత భాగస్వామి లభిస్తుంది. భాగస్వామ్యం అనుకూలం.


గురువు

వృషభ లగ్నానికి గురువు అష్టమ, ఏకాదశ స్థానాలకు అధిపతి. అకారక గ్రహమై చెడు ఫలితాలు ఇస్తాడు.

లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం ఇస్తాడు. ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఇస్తాడు. ఉద్యోగాలలో రాణిస్తారు. ధర్మగుణం, దయాగుణం కలిగి ఉంటారు.

పంచమ దృష్టి కన్యారాశి మీద ఉండటంతో గౌరవాభిమానాలు చూపించే సంతానం లభిస్తుంది. సప్తమ దృష్టి వృశ్చికం మీద ఉండటంతో జ్ఞానం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. నవమ దృష్టి మకరం మీద ఉండటంతో తండ్రితో సాధారణ సంబంధాలు ఉంటాయి.


శుక్రుడు

వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి. కారక గ్రహమై మంచి ఫలితాన్ని ఇస్తాడు.

లగ్నస్థ శుక్రుడు అందమైన శరీరం ఇస్తాడు. జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలు ఉంటాయి. మనోబలం అధికం. జనాకర్షణ ఉంటుంది. కళారంగంలో ప్రతిభ చూపగలరు.

విలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి. సుఖజీవితం కోసం ఖర్చు ఎక్కువ. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాల వ్యాపారాల్లో రాణిస్తారు. ధనార్జన బాగా చేస్తారు.

సప్తమ దృష్టి వృశ్చికం మీద ఉండటంతో విలాసప్రియ, కోపస్వభావం కలిగిన అందమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. వైవాహిక సుఖం సాధారణం.


శని

వృషభ లగ్నానికి శని నవమ, దశమ స్థానాధిపతి. ధర్మకర్మాధిపతి అయిన శని శుభుడై మంచి ఫలితాలు ఇస్తాడు.

లగ్నస్థ శని సన్నని ఆకర్షణీయ శరీరం ఇస్తాడు. శ్రమించి ఉన్నత కార్యసాధన చేస్తాడు. ఆర్థిక స్థితి సాధారణం.

సోదరులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. తల్లి, తండ్రితో సత్సంబంధాలు తగ్గుతాయి.

సప్తమ దృష్టి వృశ్చికం మీద ఉండటంతో కఠిన స్వభావం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. భాగస్వామ్యం అనుకూలించదు. మిత్రుల సహకారం తక్కువ.


రాహువు

వృషభ లగ్నస్థ రాహువు వ్యక్తికి రోగరహిత శరీరం ఇస్తాడు.

సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితం సమస్యాత్మకంగా మారుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వైవాహిక సుఖం తగ్గుతుంది. భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.


కేతువు

వృషభ లగ్నస్థ కేతువు ఆరోగ్య సమస్యలు ఇస్తాడు.

స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుంది. వివాహేతర సంబంధాల వలన వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.


📞 మరిన్ని జ్యోతిష విషయములకు సంప్రదించండి:
9866193557
098661 93557

#ఆస్ట్రాలజీ #జ్యోతిషం #జాతకము #astrologer_chinta #astroguru_chinta #astrologerinandhara

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ