మాఘ పురాణం 24వ అధ్యాయం – శ్లోకాలు, వివరణ & అర్థం
🚩మాఘ పురాణం – 24 వ అధ్యాయము🚩 🕉🌞🕉️🌞🕉️🌞🕉️🌞🕉️🌞🕉️ శ్రీమనారాయణుని అనుగ్రహము – తులసీ మహాత్త్యము ☘☘☘☘☘☘☘☘☘ గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘమువలె నల్లనిచాయతో, నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్రకుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుతుండగా, సూర్యకాంతినిమించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని […]

